పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

ప్రథమాశ్వాసము


చ.

యరయఁగఁ బుట్టినట్టి త్రిపురాంబికకూఁతురు భాగ్యదేవతన్
బరమపతివ్రతానిలయ భాసురనిర్మలగాత్రి నర్థిమై.

33


సీ.

పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ
             గౌరి గాఁబోలు నీ కాంత తలఁప
సకలసంపత్స్ఫూర్తి చాతుర్యమహిమల
             నిందిర గాఁబోలు నిందువదన
సకలవిద్యాప్రౌఢి సడిసన్న గరిమల
             భారతి గాఁబోలు భామ యెపుడు
సర్వలక్షణగుణసంపన్నతోన్నతి
             నింద్రాణి గాఁబోలు నిగురుఁబోణి
యనఁగ నిద్ధాత్రి నే ప్రొద్దు నతిశయిల్లెఁ
బరఁగ ముమ్మడి దేవయ్య భామ జగతిఁ
గామితార్థైకసంధానకల్పవల్లి
యుజ్జ్వలద్గుణనికురుంబ యొమ్మమాంబ.

34


ఉ.

ముమ్మడిదేవచంద్రునకు ముఖ్యతలోదరి యొమ్మమాంబకున్
.....మ్మగవేదశాస్త్రపరి....................శుద్ధయుక్తికిన్
ఇమ్మహి నెల్లవారలకు నీప్సితవస్తువిధాయియై ధరన్
సమ్మతి నుద్భవిల్లె వరశాంతుఁడు శాంతన యగ్రగణ్యుఁడై.

35


సీ.

పరవాదిమత్తేభపంచాననాఖ్యుఁడు
             పరవాదిమండూకపన్నగుండు
పరవాదినవమేఘపవమానధీరుండు
             పరవాదిసాగరబాడబుండు