పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

ప్రథమాశ్వాసము


గృత్యాకృత్యవివేకికిఁ
బ్రత్యర్థిద్విరదదళనపంచాస్యునకున్.

39


క.

రామామన్మథమూర్తికి
రామత్రయలీనమతికి రమ్యాత్మునకున్
సోమవ్రతవరకాంతికి
భీమజయోత్కటవిశేషభీకరమతికిన్.

40


క.

శైవాగమశాస్త్రాది
ప్రావీణ్యాగణ్యపుణ్యభరితాత్మునకున్
భావాభావవివేకికి
భావితవంశావతారపరమాత్మునకున్.

41


క.

జంభాంతకవైభవునకు
సంభృతశాస్త్రప్రతాపశైలోన్నతికిన్
శుంభత్ప్రాభవరతికిన్
దంభోళిస్ఫురితతీవ్రతరఖడ్గునకున్.

42


క.

వరముమ్మయశాంతునకుం
బరమపరిజ్ఞాననిధికిఁ బావనమతికిన్
నిరుపమవిక్రమయశునకుఁ
గరుణారసపూరితాత్మకలితాంగునకున్.

43


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధియు, నభిమతార్థసిద్ధియు, సత్యధర్మక్రియావృద్ధియు నగున ట్లష్టాదశవర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై యుండ నా రచియింపబూనిన కథానిధానంబు సకలపాపనిర్ముక్తంబై సర్వవస్తుసంధా