పింగళ నామసంవత్సర కార్తీక బ॥ 13 గురు॥సర్కి........శివ సారాయమున్నూ అద్దాల వీరన్న స్వహస్తలిఖితం॥ ఈ పుస్తకం త్సదువుల రామలింగయ్యగారికి శివార్పితంగా యిచ్చి శరణు చేస్తిమి."
శాలివాహన శకవర్షముల సంఖ్య యియకపోయినను పింగళ సంవత్సరమున తిథి వారము లీయబడినవిగాన నీ గ్రంథము లిఖంచబడిన తేదీ కనుగొనుట సులభము. అది క్రీ.శ. 2-11-1797 వ తేదీకి సరిపోవుచున్నది. కాబట్టి యీప్రతి యిప్పటికి 169 యేండ్ల క్రిందట వ్రాయబడినదని నిశ్చయించవచ్చును.
వ్రాతప్రతి
పై తాళపత్రప్రతి ననుసరించి వ్రాయబడిన కాగితపుప్రతి యొకటి మదరాసుప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నున్నది[1]. క్రీ.శ. 1917-18 లో మదరాసు ప్రభుత్వము వారు సేకరించిన విలువగల గ్రంథములలో నిది యొకటి యని యానివేదికయందు తెలుపబడినది[2].
ఈ గ్రంథము యొక్క యునికిని ప్రశస్తిని మొదట గుర్తించినవారు కీర్తిశేషులు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.
ముద్రితప్రతి
ఈ గ్రంథమును మొదట గుర్తించిన కీర్తి ప్రభాకరశాస్త్రులుగారికైనట్లుగా, దీనిని మొదట ప్రకాశింపజేసిన కీర్తి సుగృహీతనాములకు కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారికి, ముద్రించిన యశస్సు ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిది. లక్ష్మణరావుగారి పీఠికతో నిది క్రీ.శ. 1922వ సంవత్సరమున నచ్చయినది[3].
ప్రస్తుత ముద్రణము
నలభై నాల్గేండ్ల క్రిందట ముద్రితమైన యీ గ్రంథ మచ్చయిననాటినుండి, సాహిత్య ప్రపంచమున నత్యధిక ప్రచారము గాంచినది. నన్నయనతిక్కనల నడిమికాలమున నిర్వివాదముగ బుట్టిన కావ్యము శివతత్త్వసార