పుట:శివతత్వసారము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మగుటచేత, వాఙ్మయ చరిత్రకారులు, విమర్శకులు దీనిని ప్రామాణికముగ దీసికొనిరి. ఇది ప్రకటితమైన రెండేండ్లకే శతక కవుల చరిత్రకెక్కినది[1]. నన్నెచోడకవి కాలనిర్ణయచర్చలలో ప్రాముఖ్యము వహించినది - క్రీ.శ. 2004 నుండియు, విశ్వవిద్యాలయములలో ఆంధ్రవాఙ్మయచరిత్ర కెక్కి- విద్యార్థిలోకమునకు విద్వల్లోకమునకు సుపరిచితమైనదు.

ఇట్లున్నను, నీ గ్రంథమును ఆంధ్రసాహిత్యపరిషత్తునారు పునర్ముద్రణము కావించ లేరు. క్రీ.శ. 1940 లో కీర్తిశేమకు ప్రభాకరశాస్త్రిగారు-

కన్నడ శివతత్త్వసారము

[2]కనుగొన్ననాటినుండియు, నీ తెలుగుగ్రంథముయొక్క విశిష్టత హెచ్చినది. ఒక్కసాహిత్యవిషయముగనేకాక, భాషావిషయమున నీ గ్రంథము ప్రామాణికమైనది. సుప్రసిద్ధమైన శ్రీ సూర్యరాయాంధ్రభాషానిభుంటువున నిది గ్రహింపబడినది.

క్రీ.శ. 1927 లో పాల్కురికి సోమనాథుని బసవపురాణమును, క్రీ.శ.1939లో పండితారాధ్య చరిత్రమును సుపరిష్కృతములై ప్రకటితములైనవి[3]. వానిమూలముగా శివతత్త్వసారమునందలి భాషావిశేషములేగాక

  1. వంగూరి సుబ్బారావుగారిది. చూ॥ నూతనావృత్తి, ప్రస్తుత పీఠికాకర్తచే సంస్కరింపబడి పీఠికాదులచే నలంకృతమైనది.

    ప్రథమ ముద్రణము

  2. ఈ కన్నడ శివతత్త్వసారమును ప్రఖ్యాత రచయితలు, పత్రికాసంపాదకులు భాషావేత్తలునైన శ్రీ తిరుమల రామచంద్రగా రెట్లు మొదట గుర్తించిరో ఆ విషయము, "శివతత్త్వసార పాఠాల మార్పుతగునా" అను భారతి వ్యాసమున చూడనగును (సం. 38 సం. 2 పుట 78)
  3. బసవపురాణము-పరిష్కర్త-పీఠికాకర్త- వేటూరి ప్రభాకరశాస్త్రి,

    ద్వితీయ ముద్రణము 1952

    పీఠికాకర్త - ప్రస్తుత గ్రంథపరిష్కర్త. పండితారాధ్య చరిత్ర. కీ.శే. కళాప్రపూర్ణ డాక్టరు చిలుకూరి నారాయణరావు.