పుట:శివతత్వసారము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2. పూ. ము. క.

ఆలరి ధక్షుని నోమున
కేలా చనుదెంచితంచు నీశానదిశా
..........................
............................................

310

లోపించిన రెండు పాదములు కన్నడానువాదము ననుసరించి పూరింపబడినవి.

క.

వీళర్ప దక్షయాగ శె
మేలడియదె బందిరెనుత మీశానదిశా
పాలగరం సురతతియం
కూల దొళిది దిఱుదు కొందన బెన నభవా.

320

పై దానిని బట్టి తెలుగు పద్యము.

నూ.ము.క.

అలరి దక్షుని నోమున
కేలా చనుదెంచి తంచు నీశానదిశా
పాలకులను సురనికరము
శూలముతో పొడిచి చంపఁజొచ్చిరి రుద్రా!

310 పుట 59

పై పద్యములలో ప్రాసస్థానము సమానమై యుండుట గమనింపదగినది. ఇక 170 పద్యమునకు (పుట 35) 352 పద్యమునకు (పుట 67) 49 పద్యమునకు (పుట-) కన్నడానువాదము లభ్యము కానందున యట్లే విడువబడినవి. 275, 276, 277, 278 పద్యములలో చుక్కలున్న పదములు ప్రస్తుత రాజకీయ ముద్రణ శాసనము ననుసరించి లోపింపజేయబడినవి.

అర్ధ సంస్కరణము

పూ.ము.క.

వెలగొనియ దీక్షితుడు దే
వలకుం దనఁ బూజచేసి వర్తించుమెయిన్
మలహరుని దీక్షితుడు దే
వలకుం దెఱుగంగ చేయవలయును దీనిన్.

226

ఈ ముద్రితపాదమున విపరీతార్ధము గలిగినది. శివదీక్ష లేనివాడు వెల గొని అనగా డబ్బు పుచ్చుకొని శివపూజ చేయును అదియును శివపూజయే కానీ వాడు దేవలకుడు. ఇక శివదీక్ష పొందినవాడు ఆ శివపూజయే చేసినను వాడు దేవలకు డెంతమాత్రమును గాడు. అని పై పద్య తాత్పర్యము.