పుట:శివతత్వసారము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది శివదీక్షాప్రాధాన్యము నిరూపించు పద్యము. శివ దీక్షితుడుకూడ దేవలకుడే యను నర్థ మిచ్చుచున్నది. ఇది శైవమతదీక్షాసంప్రదాయమునకువిరుద్ధము, కన్నడ పద్య మిది.

క.

బెళిగొండ దీక్షితం దే
వలకం శివపూజ గెయి వర్తిపక తదిం
మలహరన దీక్షితందే
వలకను మల్లెందు తిళియ వేర్కిద వెళ్ళర్.

దీనిని బట్టి చివఱిపాదము

మలహరుని దీక్షితుడు దే
వలకుండునుగా డెఱుంగవలయు మహేశా.

అప్పుడు తెలుగు పద్య మిట్లుండును.

క.

వెలగొని యదీక్షితుఁడు దే
వలకుండన బూజచేసి వర్తించు మెయిన్
మలహరుని[1] దీక్షితుడు దే
వలకుండునుగా డెఱుంగవలయు మహేశా.

దేవలకు డనగా ఆలయపూజారి—నంబి—శివాలయముల వీరలను తంబళి యందురు. ఇతడు శివపూజయే చేయును. కానీ అది వృత్తి వెలగొని చేయుది—అతడు శివదీక్ష లేనివాడు—ఇక శివదీక్షయున్న భక్తుడును శివపూజ చేయును—అంతమాత్రముచేత అతని దేవలకుడని యువరాదు— అని సంస్కరణ పద్యమునకు తాత్పర్యము. శైవమున శివపూజకు దీక్ష నియతముగానుండవలెను.

1. క.

నిన్నెఱుగుచుఁ దన్నెఱుఁగని
యన్నఁడు శివయోగమగ్ను డనఁబడుడు [మదిలో]
నిన్నును దన్ను నెఱింగెడి
యన్నడు శివయోగమగ్నుఁ డనబడును శివా.

269

"పూర్వపీఠికలో దీనిని గూర్చి యిట్లు గలదు. (పుట 38)

"'ఆనాఁడు' అనుటకు 'అన్నఁడు' (269) 'మలహరుఁడు' అనుటకు 'మలహు' (415) అను మాఱురూపములు కానవచ్చుచున్నవి." కాని

  1. ఇచట దీక్షితుడనగా- యజ్ఞదీక్షితుడని కాదు- శివదీక్ష గైకొన్నవాడని శైవసంప్రదాయికార్థము.