పుట:శివతత్వసారము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలుగు.

ఒండేమి మల్లికార్జున
పండితుడననుండుకంటె ప్రమథులలో నె
న్నండొకొ నీ యాజ్ఞోన్నతి
నుండఁగఁ గాంతునని కోరుచుండురు రుద్రా.

387

పై రెండింటిని పరిశీలించినచో, తెలుగు కృతికే, కన్నడ మనువాద మనియు రెండింటికి కర్త మల్లికార్జున పండితుడే యనియు స్పష్టమగుచున్నది. కన్నడ భాషలో ప్రాస యుండునుగాని యతి యుండదు అందుచేత యతి ప్రాస లున్న తెలుగు కృతియే ముందు రచితమైనరని చెప్పవచ్చును-ఇక దీని మూలమున పరిష్కరించిన ఈ క్రింది విషయములను చూచినచో, కన్నడగ్రంథ విశేషము లెంతగా నుపకరించినవో తెలియగలదు.

పూర్వ ముద్రణము - పూ. ము. అను సంకేతికము. నూత్న ముద్రణము - నూ. ము.

నష్టభాగ పూరణములు

1.పూ.ము. క.

......
గా నించుకలేని నా స్థితి కస్థితి విషయా
ధీనలదురాచారికి యో
గానందము గలుగ నేర్చునయ్య మహేశా!

266

ఇందు మొదటిపాద మీక్రింది కన్నడ పద్యమునుబట్టి పూరింపబడినది.

క.

జ్ఞానం వైరాగ్యమెన
ల్కేనా నొందిరద నాస్తికస్థితి విషయా
ధీవ దురాచారిగ యో
గానందం దొరకలాక్కుమే సర్వేశా.

278

కాబట్టి మొదటిపాద మీ క్రిందిరీతి నుండును.

నూ.ము.క.

(జ్ఞానము వైరాగ్యము నన
గా) నించుకలేని నాస్తిక స్థితి విషయా
ధీన దురాచారికి యో
గానందము గలుగనేర్చునయ్య మహేశా.

267 పుట 51