పుట:శివతత్వసారము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నరకస్థులు స్వర్గస్థులు
నరతిర్యగ్గర్భ యేవన స్థాదిపశూ
త్కరములు భవత్ప్రసాద
స్ఫురణము దొరకొనుడు ముక్తి బొందుదురు శివా![1]

106


క.

అరుదుగ భవత్ప్రసాదము
దొరకొను శివభక్తి గాన దుస్తరభవ ని
ష్ఠురదుఃఖసముద్రసము
త్తరణవహిత్రంలు భక్తి దానయ్యె శివా![2]

107


క.

నియతమగు సకలపుణ్య
క్రియ లెల్లను భావశుద్ధికిని హేతువు ల
క్షయభాతి భావశుద్ధియు
గ్రియఁగొన నీ పాదభక్తికిని హేతు వజా![3]

108


క.

అతిగుహ్యంబుల కంటెను
నతిగుహ్యతరంబు శివుని యందుల భక్తి
స్థితియని మోక్షార్థులు దృఢ
మతిఁ గొలుతురు దేవ! నిన్ను మనుజులు ప్రీతిన్.

109


క.

జలజాసనాచ్యుదాద్యమ
రులకును [నిది యిట్టిదని] నిరూపింపఁగ న
గ్గలమగు నీ నిజరూపముఁ
దొలఁగఁక నీ భక్తు లెఱుఁగుదురు సర్వజ్ఞా!

110
  1. భూలోక, నరక, స్వర్గవాసు లందఱును శివుని వలననే ముక్తి నందుదురు.
  2. తరింపరాని సంసారసముద్రమును దాటుటకు శివభక్తి యొక్కటే నావ యగును.
  3. పుణ్యకార్యములు భావశుద్ధికి హేతువు. భావశుద్ధి శివపాదభక్తికి కారణ మగును.