పుట:శివతత్వసారము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధర్మాధిక్యంబున నతి
నిర్మలబోధయు విరక్తి నిష్ఠయుఁ గలయ
క్కర్ములకు నీప్రసాదము
పేర్మిని శివభక్తి పుట్టు పృథుభావమునన్.[1]

102


క.

శివభక్తి సకలధర్మ
ప్రవర మహాధర్మ మగుటఁ బరికింపఁగ భా
గ్యవిహీనులగు దురాత్ముల
కవశ్యమును సంభవింప దతిలోకశివా![2]

103


క.

మానితశివభక్తి శివ
జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా
నూనితగర్మక్షయమై
యానందప్రాప్తిముక్తుఁడౌ మనిషి శివా![3]

104


క.

నరసురతిర్యక్సచరా
చరజీవుల కెల్ల భక్తి సంభావన నీ
కరుణ ప్రధానమ ముక్తికి
వరుసన యనలేదు భావవశ్యుఁడ వగుటన్.[4]

105
  1. ధర్మము, బోధ నిష్ఠగలవారికే శివప్రసాదమువలన శివభక్తి కలుగును.
  2. సకలధర్మములలో నత్యుత్తమమైనది శివభక్తి. అది అభాగ్యహీనులకు నలవడదు.
  3. శివభక్తి జ్ఞానధ్యానములచే శివప్రసాదము లభించును. దానివలన కర్మము నసించి యానందము చేకూరును.
  4. శివుడు భావవశ్యుడు గాన సచరాచరములలో నందఱును నొకక్రమమునగాక నొకేసారి ముక్తి బొందవచ్చును.