పుట:శివతత్వసారము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వేదాద్యష్టాదశవి
ద్యాది మహాకర్త నీమహత్త్వము వొగడన్
శ్రీదయితావల్లభ వా
ణీదయితావల్లభులును నేరరు రుద్రా!

97


క.

స్వర్గాపవర్గసుఖము ని
రర్గరళసామ్రాజ్యసుఖము నాత్మజవిద్యా
వర్గాది లోకసుఖములు
భర్గ! భవత్పాదభక్తి ఫలములు రుద్రా!

98

శివభక్తి వివరణము

క.

ఒక్కం డీశ్వరుఁ డని మరి
నిక్కముగా నెఱిఁగి భక్తినిష్ఠావృత్తిన్
ముక్కంటి! నిన్నుఁ గొలిచిన
దిక్కక [1]దొరకొనె సమస్తదివ్యసుఖంబుల్.

99


క.

భక్తి నినుఁ గొలువవలయును
భక్తియు ధర్మువునఁ గాని ప్రభవింప దతి
వ్యక్తముగ ధర్మువును వే
దోక్తముగ నెఱుంగవలయుఁ దుదిని మహేశా.

100


క.

వేదోక్తసదాచారా
పాదనమున నెగడు నట్టి పశువులకు బురా
పాదితదురితక్షయమై
యాదరమున ధర్మ మధిక మగు నీశానా!

101
  1. దొరకవె ము.