పుట:శివతత్వసారము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఏమని చెప్పుదు శంకర !
నీ మహిమాడంబరంబు నిఖిలాజాండ
స్తోమములు బ్రకృతి నీ యి
చ్ఛామాత్రనె పుట్టునటె యసంఖ్యాతములై.

92


క.

త్రిమలములును రాగద్వే
షములును [జన్మంబు] గర్మసంస్కారంబుల్
గమనాగమకాదులు నను
సమస్తమును లేవు నీకుఁ జంద్రాభరణా!

93


క.

పతి సదృశాదిక తాప
త్రితయ గుణత్రితయ జన్మ మృతి సుఖదుఃఖ
క్షతవృత బంధ[న]మోక్ష
స్తుతి నించాదులును లేవు ధూర్జటి! నీకున్.

94


క.

ఓలిన దేవ! యవిద్యా
కాలకళానియతి వికృతి కార్యా కార్యాం
భీలాబాంధవ బాంధవ
మాలాబంధములు లేవు మఱి నీకు శివా!

95


క.

అంచితమతి నెవ్వరు ని
ర్మించిరె గుంచిత సురలు [1]నివృత్త్యాదికళా
పంచకసంచితమైన ప్ర
పంచము నీ యట్ల రుద్ర! పరమానందా?

96
  1. నివృత్యాదికళాపంచకము — నివృత్తి, ప్రతిష్టు, విద్య, శాంతి, శాంత్యతీతము అనునవి శైవుల కళాపంచకము.