పుట:శివతత్వసారము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బరమస్వతంత్ర శంకర
కరుణాకర నీవ యాదికర్తవు రుద్రా!

86


క.

భువనోత్పత్తి స్థితి లయ
వివిధవ్యాపారముఖ్యవిభుఁడవు పశుబం
ధవిమోక్షదక్షుఁడవును [1]
రవరప్రదుఁడవును నీవె రాజాభరణా!

87


క.

పరమాత్మ పరబ్రహ్మము
పరమేశ్వరుఁ డనఁగ నామపర్యాయంబుల్
హరునికి మ(ఱి)యుఁ దత్త్వాం
తరవాచకములని పలుకఁదగదు మహేశా!

88


క.

పరమాత్మ పరబ్రహ్మము
పరమేశ్వరుఁ డనఁగ హరియుఁ బ్రహ్మయును బరా
పరవిభులు గారు శాస్త్రము
లరయఁగ జీవాత్ము లగుట నందఱు రుద్రా!

89


క.

పర శబ్దంబున కర్థం
బరయఁగ నుత్కర్ష మంద్రు రయ్యుత్కర్షం
బొరులకు గలుగునె శివ! నీ
కరణి మహాదేవుఁ డొరుఁడు గలఁడే జగతిన్.

90


క.

ఖరకర పద్మజ రుద్రాం
బురుహోదర ముఖ్య దివిజపుంగవ సచరా
చరభూతనికర పంచా
వరణంబులు గొల్వ నుండువాఁడవు రుద్రా!

91
  1. సర్వవరప్రదుఁడవు(ను) నీవు రాజాభరణా! ము.పా.