పుట:శివతత్వసారము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నివుడు రజోగుణ సంగతి
భవుఁడను నామంబు నీకుఁ బరగు మహేశా![1]

81


క.

మడి యిల్లు తత్త్వముల వెనుఁ
బడక నిజాజ్ఞాప్రశస్తి భావింపఁగఁ జొ
ప్పడు సాత్త్వికగుణసంగతి
మృడుఁడను నామంబు నీకు మేలిల్లు శివా!

82


క.

పరపగు తత్త్వములుఁ జరా
చరవితతులు సంహరింపఁజాలిన యతిభీ
కరతామసగుణసంగతి
హరుఁడను నామంబు నీకు నమరు మహేశా!

83


క.

పరమస్వతంత్ర నిర్మల
పరమానందాత్మ పరమభట్టారక ని
స్తర నిస్త్రైగుణ్య మహ
త్తరరూపంబున శివాభిధానం బయ్యెన్.

84

జగత్కర్తృలక్షణము

క.

పరమస్వతంత్రుఁడై, య
క్షరుఁడై, సర్వజ్ఞుడై, వికారరహితుఁడై,
కరుణాకరుఁడై, స్థిరుఁడై
వరద! జగత్కర్త యుండవలదె మహేశా!

85


క.

పరివిశ్రుత సచరాచర
భరితానేకాండమగుఁ బ్రపంచంబులకున్

  1. షట్త్రింశత్తత్వవితానములు 14వ పద్యమున వివరింపబడినవి.