పుట:శివతత్వసారము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్దండితశక్తిసమేతులు
చండీశ్వర వరద! నీ ప్రసాదమున శివా!

76


క.

కీర్తింపఁగ లోకములకుఁ
గర్తలు విష్ణ్వాదులయ్యు గా రాది మహా
కర్త భవత్ప్రేరితులై
వర్తిల్లుట గారణముగ వారలు రుద్రా!

77


క.

నారాయణాదులకు సం
సారిత్వము దెల్ల మెల్ల శాస్త్రంబులఁ ద
త్కారణమునఁ దత్కృతము వి
చారింప భవత్కృతంబు సర్వానందా!

78


క.

ఆర్యేశ్వర! తమ చేసెడి
కార్యము లందెల్లవారు కర్తలు గారే
కార్యకరణత్వమాత్ర న
వార్యజగత్కర్త లనఁగవచ్చునె వారిన్.

79


క.

తన తెగిన తలయు మడిసిన
[1]తనయునిఁ బుట్టింపఁ గావఁ దారోపని యా
వనజాసన కేశవులకు
జననస్థితికర్తృతాదిశక్తులు గలవే![2]

80

భవానీశబ్దవివృతి

క.

ప్రవితత షట్త్రింశత్త
త్త్వవితానంబులకు నుద్భవస్థానం బై

  1. వెండియు బ్రతికింప ము.పా.
  2. ఇందు వివరించిన పంచమశిరఃఖండనము - మన్మథదహనము సూచితమైనది.