పుట:శివతత్వసారము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వసుమతిఁ జిత్రమ జితచి
త్త సంభవా "నకర్మణాన తపసా నజపై!
న్న సమాధి భి" రవ్యయ నీ
యసదృశభక్తికినిఁ బ్రియుఁడ వగు దీశానా!

111


క.

[1]వేయేమి తోడఁ బలుకుదు
పాయక నినుఁ గొలుచు నచలభక్తులఁ గని "య
య్యా" యని పిలిచిన నంబి కి
"నో" యని యెఱుఁగీవె తొల్లి యురగాభరణా!

112


క.

శివభక్తి లేక చేసిన
వివిధాధ్వరముఖ్యసకలవేదపురాణా
దివిహితకర్మవికాసము
లవి యెల్లను నిష్ఫలంబు లగు నీశానా!

113


క.

భక్తియ ముక్తి తెరువు వి
ధ్యుక్తముగ నమేయప్రియచతుర్వేదా 'మ
ద్భక్తశ్చ శుచీ' యను నా
సూక్తిఁ బ్రధానంబుగాఁ బశూత్తముల కజా!

114

భక్తుల మహిమ

క.

కొనునది భక్తుని చేతనె
ధన మతనిక యిచ్చునదియు "తస్మైదేయం"
బనియును "తస్మాద్గ్రాహ్యం"
బనియును గలదనిరి వేదభక్తి విధిజ్ఞుల్.

115


క.

కథ లేటికి "నచపూజ్యో
యథాహ్యా హ"మ్మనిన విధి యథార్థముగా మ

  1. నంబి (సుందరమూర్తి నయనారుకథ. పండితారాధ్యచరిత్ర, మహిమప్రకరణమునగలదు.)