పుట:శివతత్వసారము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్సీ యని యొల్లక రోసి 'శి
వాయ నమో' యనుచు నిన్నె వలగొండ్రు శివా![1]

66

జగత్కర్తృవిచారము

క.

ఏ నిశ్చయపరుఁడను నీ
శానుఁడు నా స్వామి యనుచు సంతతమును సం
త్రాణగతి స్వామి భృత్య
జ్ఞానంబున నిన్నె గొల్తు సర్వానందా!

67


క.

క్షణిక మచేతన మది ని
గ్గుణము జగత్కార్యకరణకుశలం బగునే
గణనాతీతమహాగుణ
గణకృత్యవిహీనమైన కర్మము గలదే!

68


క.

పరికింప నచేతనములు
పరమేశ్వర మది ప్రధాన పరమాణ్వాదుల్
పురుషుఁడు చేతనుఁ డయ్యును
కర మజ్ఞుఁడు గాన కర్త కాఁజాలఁ డజా!

69


క.

అవయవయుతములు గావున
నవీన ప్రముఖంబులగు మహాభూతంబుల్
వివిధ వితర్క విచారణ
సవశ్యమును గార్యములు మహామహిమ శివా!

70
  1. 33-66 వఱకును అద్వైతవాదము ఖండింపబడినది.
    (మా శైవులైన) ఆ ప్రఖ్యాతులైన) వాదుల యెదుట = మాయావాదుల ముందఱ.
    మాయావాదులు - అద్వైతులు.