పుట:శివతత్వసారము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాయక వేదాంతాభి
ప్రాయముఁ గడుఁ దప్పఁ జెప్పి పఠియింతు రజా![1]

62


క.

సర్వము నీ యాధీనమ
సర్వేశ్వర! కాన గుణవిచారితవృత్తిన్
సర్వంబు నీవ యను శ్రుతి
నిర్వాహము బొంద నేర్చు నిత్యానందా!

63


క.

అద్వైతైకస్థితి నీ
యద్వైతమ గాన యీశ్వరాద్వైతము స
ర్యాద్వైత మనఁగ వేఱు జ
గద్విపరీతమగు తత్త్వగతి గలదె శివా!

64


క.

ఇది గాదని శ్రుతి చెప్పిన
నది గ్రమ్మఱన నీ స్వరూపమని చెప్పెడి దు
ర్మదులగు మాయావాదుల
చదువులు వోవిడిచి నిన్నె వదలెద రుద్రా!

65


క.

మాయావాదుల ముందఱ
మాయావాదు లటె వారిమార్గముఁ గీడి

  1. ఐశ్వర్యాద్వైతము - ఈశ్వరత్వమునకు సంబంధించిన యద్వైతము. తనకు సాటివాడు లేనందుక గలిగిన యనన్యభావము. అందుకు దామే యీశ్వరుడగుట వలనను తనకు సమానుడు కాని అధికుడు గాని లేనందువలనను 'ఒక్కడు' అని చెప్పబడెను గాని జీవుడు ఈశ్వరుడు ఒక్కడు అను నర్థమందు గాదు.