పుట:శివతత్వసారము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

త్తమ కారుణ్య వశంబున
విముక్తులై నీవపోలె వెలుఁగుదురు శివా![1]

30

అద్వైతమతఖండనము

క.

జ్ఞానజ్ఞేయజ్ఞాతృని
దానత్రయమున బాధితప్రత్యయమై
నానాగతి నవగతమగుఁ
గాన జగద్భేద మెన్నఁగా సిద్ధ మజా!

31


క.

భేదము దృష్టాదృష్టని
పాదకమై వైదికోక్తపథదర్శనసం
పాదన సమర్ధ మగుటను
భేద మదర్శనము ప్రమితి పిండితము శివా?[2]

32


క.

భేదము సిద్ధంబగుడు వి
భేదకసిద్ధియగుఁ దద్విభేదకసిద్ధిన్
వేదోక్తకర్మ దశలం
చాదరమగుఁ దత్ఫలప్రదారాధ్యగతిన్.

33


క.

ఆరాధ్యుడైన యీశ్వరు
నారాధించుటయ స్వర్గ మపవర్గము ధా
త్రీరాజ్యాదిసుఖంబులు
బోరన గర్మానురూపముల జనుల కగున్.

34
  1. సంసారదుఃఖములలో మునిగి యున్న జీవరాసులు. నీ దయవలన నీవలెనే యొప్పుచున్నారు.
  2. ప్రమితి యథార్థజ్ఞానము