పుట:శివతత్వసారము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ప్రత్యక్షజగద్భేదము
సత్యంబై తోచుచుండ శబ్దంబునఁ ద
త్ప్రత్యక్షబాధ యగునని
యత్యనుచితవృత్తి నడుతు రద్వైతు లజా![1]

35


క.

అమరఁగఁ బ్రపంచమిథ్యా
త్వమ సెప్పెడు వాది మున్ను దానికి సద్భా
వము దా నెఱుఁగక మిథ్యా
త్వ మనాశ్రయ మెట్లు జెప్పఁ దలపోయు శివా!

36


క.

మానము చేత గృహీతము
గాని ప్రపంచ మ్మెఱుంగఁ గడు దుర్ఘటమౌ
మాన గృహీతము తథ్యమ
తా నెన్నఁడు మిథ్యగాదు తలపోయ శివా!

37


క.

ఉత్తరశుక్తిజ్ఞానని
వృత్తంబగు శుక్తి రజితవేదనము క్రియన్
వృత్తజగద్భేదము చెడు
నత్తఱి నద్వైతు లెన్న రండ్రు మహేశా!

38


క.

నిర్వచనీయము లేక య
నిర్వచనీయంబు గలదె? నిర్వచనీయా
నిర్వచనీయోత్పత్తి న
సర్వాద్వైతంబు చెడదె సర్వానందా!

39


క.

జీవుఁడు శివుఁడను వాక్యము
భావింపఁగ నైక్యమునకుఁ బ్రతిపాదకమే

  1. శబ్దంబున - ఉపనిషద్వాక్యము వలన