పుట:శివతత్వసారము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ శరణ్య మనంబశు దు
ర్వశభవ పాశములు తెగక వచ్చునె యెందున్.[1]

26


క.

బ్రహ్మోక్త సమస్త హరి
బ్రహ్మాది పిపీలికాంతపశువుల కెల్లన్
బ్రహ్మోపేంద్రయశోహర
బ్రహ్మేశ్వర రుద్ర నీవ పతి వతిలోకా![2]

27


క.

వేదోక్తమార్గమున న
త్యాదరమున నిన్నుఁ గొలిచి యప్పశువులు నీ
చే దేహపాశబంధ
చ్ఛేదంబున ముక్తులగుట సిద్ధము రుద్రా![3]

28


క.

గోపతికృతమున భవపా
శాపేతములైన పశువు లట్ల భవత్ పా
శాపేతులైన పశువులు
ప్రాపింతురు మోక్షసుఖము పశుపతి నీచేన్.[4]

29


క.

త్రిమలకృత దుఃఖ సంసా
ర మహాబ్ధి నిమగ్నజీవరాసులు నీ యు

  1. జీవరాశులు పశువులు - పశు పాశములకు నీవే పతివి. నిన్ను శరణం చొచ్చిన గాని యాపాశములు తెగవు.
  2. వేదోక్తమైన బ్రహ్మ మొదలు పిపీలికాంతపర్యంతముగల జీవములకు శివుడే అధిపతి.
  3. వేదములలో చెప్పబడిన రీతిని శివుని గొల్చిన పశువులకు దేహపాశబంధములు వీడి ముక్తిపదము లభించును.
  4. గోపతివలన పాశము వీడిన పశువులవలె నీ పాశము వీడిన పశువులు మోక్షపదవి నందెదరు.