పుట:శివతత్వసారము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానిత షష్ఠీతత్పురు
షానూనసమాన మెఱుఁగ రజ్జులు రుద్రా![1]

23


క.

జీవు లనేకులు పశువులు
భావింపఁగఁ బ్రకృతి వికృతి బంధము పాశం
బావృతములనం బశువులు
నీ వా రెంటికిని బతివి నిరుప మహేశా![2]

24


క.

పశుపతియ పాశములఁ దన
పశువులకును బంధమోక్షపద్ధతి సేయం
గుశలుఁడుగా కవి యొరులకు
వశవర్తులె? నేర్పు గలదె వారికి రుద్రా![3]

25


క.

పశువులట! జీవరాసులు
పశుపాశంబులకు నీవ పతివఁట! శివ! నీ

  1. అతద్గుణ సంవిజ్ఞాన బహువ్రీహి మాన్ప- మాన్పబడునది పాశము బద్ధపశు అనునది యిట్టి సమాసము- బద్ధాః పశవః ఏనసః అని విగ్రహము- ఇది పాశమునకు విశేషము.
    అణ్మానిత షష్ఠీతత్పురుషాతమానసమాసము. పశూనాః పతిః పశుపతిః (షష్ఠీతత్పురుషము) పశు పతేరిదం పాశుపతం- (పశుపతి+అణ్) పాశుపతవ్రతముచేత బద్ధపశుత్వవిశిష్టమైన వైహికపాశము తెగును.
    కొందఱు బహువ్రీహిసమాసముగ చెప్పెదరు కాని యది షష్ఠీతత్పురుషసమాసము. చూడుడు. సోమనాథ భాష్యము. 188 ప్ర.
  2. జీవులు పశువులు, ప్రకృతి వికృతి, సంబంధము పాశము శివు డారెండింటికి పతి.
  3. పశుపతియే పాశమువలన తన పశువులకు బంధమోక్షములను చేయ సమర్థుడు. ఇతరుల కట్టి సామర్ధ్యము లేదు.