పుట:శివతత్వసారము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మయులగు ప్రమథగణములకు
జయమగు వేదాది ధర్మచరితులకు శివా![1]

19


క.

శివమగు ధార్మికనృపులకు
శివమగు గోబ్రాహ్మణులకు శివమగు మఱియున్
శివనిందావిరహితులకు
భువనత్రయజనుల కెల్లఁ బుణ్యంబు హరా![2]

20

పశుపాశపతిజ్ఞానము

క.

జ్ఞానము పశుపాశపతి
జ్ఞానమయుని యట్లెఱుంగఁజాలని జడు ల
జ్ఞానులు వారల తత్త్వ
జ్ఞానము లజ్ఞానములు విచారింప శివా![3]

21


క.

పతి రుద్రుఁడు పశువుల కని
శ్రుతి చెప్పుచు నునికిఁ జేసి రుద్రుఁడు పతి త
క్కితరులు పశువులు పొమ్మని
మతిలో నెఱిఁగితి శ్రుతిప్రమాణమున శివా![4]

22


క.

పూని యతద్గుణ సంవి
జ్ఞాన బహువ్రీహి మాన్పఁ జనుదెంచిన యణ్

  1. ..........
  2. ...........
  3. జ్ఞానమనగా పశుపాశుపతి జ్ఞానము - ఇది తెలియనివా రజ్ఞానులు - వారిజ్ఞాన మజ్ఞానము.
  4. వేదప్రమాణమువలన, పతి రుద్రుడు, తక్కినవారెల్ల పశువులని తెలియదగినది.