పుట:శివతత్వసారము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సరసిజభవ సరసిరుహో
దరులకు నటమీఁది మూఁడు దానధికము ము
వ్వురు నియమకారు లవ్వా
రరిది జగత్కర్త బాధ్యు లతిమహిము లజా![1]

15


క.

శ్రీమత్సదాశివేశ్వర
నామ భవద్ధామముల మనంబునఁ దలఁపం
గా మఱి వాక్కునఁ బొగడం
గా మాకలవియె సమస్తకామాతీతా![2]

16


క.

సర్వేశ్వర : కావున భవ
దర్వాచీనస్వరూపుఁ డనఁదగు శ్రీమ
త్పర్వతపుత్రీపతి మ
ద్గీర్విభవము శక్తి కొలదిఁ గీర్తింతు శివా![3]

17

షష్ఠ్యంతములు

క.

జయమగు వేదంబులకును
జయమగు బంచాక్షరికిని జయమగు నిటలా
శ్రయమగు భసితంబునకును
జయమగు మాహేశ్వరులకు సంతతము శివా![4]

18


క.

జయమగు శివమార్గమునకు
జయమగు శివసంహితలకు జయమగు గ్రీడా

  1. బ్రహ్మ విష్ణువు జగత్కర్తలు కారు. రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అను వారు ముప్వురే జగత్కర్తలు- నియమకారులు.
  2. సదాశివేశ్వరాది నామములు- మనస్సులో దలచి, పొగడుట కలవికాదు.
  3. పార్వతీపతి స్వరూపమును మాత్రమే నాశక్తి కొలది కీర్తింతును.
  4. ................................