పుట:శివతత్వసారము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గతి మున్నెఱుఁగక శివ! భవ
దతిశయగుణకీర్తి సేయ నెలవియె రుద్రా![1]

7


క.

స్తుతియును నిందయు లోక
త్రితయంబున నీకు లేమి దెల్లంబగుటన్
మతిఁ దమకుఁ గృతార్ధత్వ
ప్రతిపత్తికి మిమ్ము జనులు బ్రణుతించు రజా![2]

8


క.

ఓడక నినుఁ బొగడఁగ నా
యీడగుఁ గాదని తలంప కే వేదుఱనై
చూడవె పొగడెద [3]ననియెడు
వేడుక కారణముగాఁగ వెఱవక రుద్రా![4]

9


క.

నే నొక నికృష్టమనుజుఁడ
మానసవచనాతిదూర మహనియ్యమహ
త్త్వానంద! నిన్నుఁ బొగడఁగ
నే నెంతటివాఁడ సురమునీంద్రవరేణ్యా![5]

10


క.

పన్నుగ లజ్జింపక శివ!
నిన్నే బొగడెద ననంగ నేర్తునే దేవా!

  1. శివుని నిజస్వరూపగుణములను గ్రహింపకయే, ఆ శివతత్త్వమును గొప్పగా కొనియాడుట యసాధ్యము.
  2. స్తుతి నిందలు నీకు లేకపోవుటచే, తమ్ము కృతార్థులునుగా చేసికొనుటకు జనులు మిమ్ము నుతియింతురు.
  3. ననియెద ము.ప్ర.
  4. నిన్ను పొగడుటకు నా కలవికాదు. అది వెఱ్ఱితనమే. అయినను నిన్ను పొగడెడనని వేడుకయే నిన్ను స్తుతించుటకు పురికొల్పినది.
  5. నేనొక హీనమానవుడదు. మనస్సునకు, వాక్కున కందరాని మహాత్మ్యము గల నిన్ను పొగడుటకు నేనెంతవాడను.