పుట:శివతత్వసారము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వాడేమి "యనంతావై
వేదా"యను వేదములు [1]వివిధ వివరములున్
వాదిడి వెదకెడి నన్న మ
హాదేవా! నిన్నెఱుంగ నన్యుల తలమే?[2]

4


క.

నీ మూర్త్యాత్ముల నీ వని
ప్రేమముతోఁ గొలుతురెంత పెద్దలు నీ త
త్త్వామేయరూప మెఱుఁగుట
సామాన్యము [3]గాఁగఁజేసి సర్వానందా![4]

5


క.

హరి సరసిజభవులాదిగఁ
బరమమునీంద్రులకు నెఱుఁగ భరమగు నీ ని
ర్భభూరిమహిమ వొగడఁగ
నరు లెంతటివా రనాథనాథ! మహేశా![5]

6


క.

స్తుతనిజగుణకథనమునకు
నతిశయగుణకథన[6]మండ్రు రన్నిజగుణసం

  1. యువిధ వివరముల్
  2. అనంతములైన వేదములు వానియర్థవివరణలు, శివు నెఱుంగుటకు తమలో తాము విచారములు చేయుచునేయున్నవి.
  3. గామిఁ జేసి ము.ప్ర.
  4. తత్త్వాతీతమైన శివస్వరూప మెఱుగుట కలవి కాదిది. కావున పెద్దలు శివుని యష్టమూర్తులగు పృథివి, జలము, తేజము, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి అను వానిని సేవింతురు.
  5. బ్రహ్మ మహామునులు మొదలగువారికి శివుని మహామహిమ స్తుతించుట కలవి కానిది - అట్టియెడ మానవు లాస్తుతి కెంతమాత్రము సమర్థులు కారు.
  6. మందురన్ని