Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డనఘుం డాతని కుద్భవించ్చె మను వుద్యద్వేదశాస్త్రార్త్థత
త్వనిజాచారసమస్తధర్మ్మనయశాస్త్రప్రౌఢి కాచార్య్యుండై.

3


గద్దె.

ఇట్టి మనువంశంబున నిక్ష్వాకు పుట్టె నిక్ష్వాకువంశంబునం గకు
స్థుండు పుట్టె నాతనికిం బ్రిథివి దనపేరు జేసినం బ్రిథుండు[1] పుట్టెం
బ్రిథువంశంబున మాంధాతృండు పుట్టె మాంధాతవంశంబునం బురు
కుత్సుండు పుట్టెం బురుకుత్సువంశంబున సాగరంబు దనపేరం
జేసిన సగరుండు పుట్టె సగరవంశంబున దిలీపుండు పుట్టె దిలీపవం
శంబున భాగీరథి దనపేరుగాం దెచ్చిన భగీరథుండు పుట్టె భగీ
రథవంశంబున నతీతానాగతవంశకర్త యైనరఘువు పుట్టె రఘువం
శంబున నారాయణావతారుడైన శ్రీరాముండు పుట్టె శ్రీరామ
వంశంబున నలుచక్రవర్త్తి[2] పుట్టె నలునికిం బుండరీకుండు పుట్టె
పుండరీకవంశానుక్రమంబున నాదిరాజులకంట్టెం బ్రసిద్ధుండై కరి
కాలచోడచక్రవర్త్తి పుట్టి భానువంశంబు గరికాలవంశంబునాం
బేరుకొని చతుస్సాగరపరియంత్త[3]మహీచక్రంబు నిర్వ్వక్రంబు
గా వాలివాతం బాలించ్చి —


క.

కరికాలచోడనరపతి
పరగంగ నిజలాంచ్ఛనములు బలువిడి హిమవ
ద్గిరితటముల సేతుమహీ
ధరతటముల నిలిపెం జక్రధరతుల్యుం డై.

4


క.

కావేరిదరులు గట్టంగ
వేవేపల్లవుడు దనదు వెట్టికి రామినిం[4]
దావాని నుదిటికను వోం
గావడిం గరికాలవిభుండు గాలం దుడిచెను.

5
  1. "జేసిన ప్రిథుండు" అని యుండవలయును.
  2. నలచక్రవర్త్తి
  3. "పర్యంత్త" అని యుండవలయును.
  4. రామిన్