Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీనితరువాత సీసపద్య మున్నది గాని, ఖలమైనది. దానియంతమందలి యెత్తుగీతి —

బ్రస్తుతంబుగా నిలిచి గోపాలదేవు
నకు హితముగ నాచంద్రతారకము గాంగ
దేవభోగంబుగా నిచ్చె ధీరనుతుండు
బచ్చుసూర్య్యుండు సుజనైకబాంధవుండు.

2

—————

58

శ. స. 1146

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శంకరేశ్వరస్వామి యాలయములో నొకఱాతికంబముమీఁద చెక్కఁబడియున్నది.. South Indian Inscriptions Vol. VI. No 628)

శా.

శ్రీమత్కౌస్తుభరత్నభూషణరుచిశ్రీరమ్యవక్షస్థలుం
డామందారలతాంత్తదామనవదివ్యామోదపాదాబ్జజా
తామేయామరసింద్ధువారిక్రితపూతాసేష[1]లోకుండు నాం
గా ముల్లోకవిభుండు సక్రి గలం డైక్యవ్యాప్తి దా నాద్యుండై.

1


ఉ.

ఆతరిదాల్పునాభిదలితాబ్దమునం దుదియించ్చె బ్రహ్మ సం
ప్రీతిగ నావిరించికి మరీచి జనించ్చె మరీచి కన్వయ
ఖ్యాతుండు పుట్టెం గస్యపుండు[2] గస్యపుం[3] డనుముని కుద్భవించ్చె లో
కాతతరమ్యమూర్త్తి గమలాప్తుండు సూర్య్యుండు వంశకర్త్తయై.

2


మ.

ఘనుఁ డాసూర్య్యున కన్వయాద్రిజుం డనంగ్గా రాజధర్మ్మంబతా(౦)
దనువై శాశ్వతరాజయోగమున నొందం బుట్టె వైవశ్వతుం[4]

  1. "శేష" అని యుండవలయును.
  2. గశ్యపుండు
  3. గశ్యపుం
  4. వైవస్వతుం