Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

శ. స. 1131

(ఈ శాసనము గుంటూరుమండలమందు సత్తెనపల్లితాలూకాలో వేల్పూరిగ్రామమందు శ్రీరామలింగేశ్వరస్వామియాలయము వెలుపలిమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది - Government Epigraphist's list No 554 of 1925)

చ.

శకసమములు మహీగుణవృషధ్వజసంఖ్యగం జైత్రకృష్ణప
క్షకతిథిం జంద్రజాహనజసంక్రమణంబున వేల్పునూరిఱే
నికి వరరామనామునకు నెమ్మిం బ్రదీపము గేతవల్లభో
త్సుకమతిం బెట్టె దాం గసది సూరమదేవు లఖండ్డ మున్నతిని.

1


శ్రీమన్మహామండలేశ్వర కోటకేతరాజులు భోగస్త్రీ కసది
సూరమదేవులు శకవర్షం౦బులు 1131 ణ్డగు నేంట్టి చైత్ర బ 2 బు
ధవారమున విషువుసంక్రాంతియందు దమతల్లి యమరసానికి ధర్మ్మా
ర్త్థముగా వేల్పు—

(అసంపూర్తి)

—————

57

శ. స. 1140 ప్రాంతము

(ఇది కృష్ణామండలము నందిగామతాలూకాలోని మోగల్లుగ్రామమందు వేణుగోపాలస్వామిగుడియెదుట నున్నఱాతిమీఁది శాసనభాగము. శాసనసంవత్సర మున్నభాగము ఖిలమైపోయినది. కాని గద్యభాగములో నీదానము కాకతీయగణపతిదేవుని పుణ్యమునిమిత్తము చేయఁబడిన ట్లున్నది. కావున, శాసనము శ. స. 1140 ప్రాంతమునాఁటి దనవచ్చును. Government Epigraphist's Collection Nos. 265-67 of 1924.)

శా.

శ్రీమంతుం డగుబచ్చునామయం బ్రభాశ్రీరమ్యు శ్రీరాముం దే
జోమిత్రుం డగునన్నవోతి దయం గాచుం గాత నిత్యంబు సు
త్రామారాధితపాదపంకజసముద్యత్సుందరుం డైనశ్రీ
భామాధీశుం డభీష్టసత్ఫలము లొప్పం బ్రీతితో నిచ్చుచున్.

1