Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇనుపాదము లర్చింపంగం
జనుచో(౦)జని అర్ఘ్యమంత్రజలపాత్రలు దా
వినువీది నాంగం బంచ్చెను
ఘనముగం దనయాన వొడిచి కరికాలుం డిలను.

6


క.

అట్టి కరికాలన్రిపతికిం
బుట్టెను మహిమానచోడు భువి నతనికిం దాం
బుట్టిరి గరికాలుండు సిరి
కట్ట ననుంగులుం దొండమా(నఘ)నదశవర్మ్మలు.

7


క.

ఆకరికాలనరేంద్ర
ప్రాకటవంశమునం బుట్టె భాస్కరకులర
త్నాకరచంద్రుండు రిపున్రిప
భీకరుం డధికుండు చోడబిజ్జన బిరుదై.

8


క.

రూడిగ బిజ్జన దను రెం
డాడిన భూపతులశిరము లసిముఖమునం జెం
డాడుచుం గయ్యము లిరువది
ఏడెన్నంగ బొడిచె జయమహీవల్లభుం డై.

9


క.

బల్లహుతో ఘనబిజ్జన
వ్రల్లాటమున[1] వచ్చుపాముం బట్టినం గని యా
బల్లహుం డిచ్చె గుణాంక్గము
గొల్లభిగొని జనులు గండ్డగోపాలుం డనను.

10


క.

దండ్డి (జగ)దొబ్బగండ్డండు
గండరగండండు వీరఖణి బిజ్జన యు

  1. "వ్రల్లటమున" అని యుండవలయును.