Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

శ్రీలలనాపరిగ్రహుండు శ్రీధరునగ్రతనూభవుండు వి
ద్యాలలనుండు గంటం డుదయస్థితి నొప్పుటం జేసి పౌర్షం[1]
బేలికి యిచ్చెం[2] బేర్మ్మి నుతికెక్కె వదాన్యత ప్రస్ఫురించె భూ
పాలకనీతినిస్తరణ (ప)ట్టముగట్ట[3] ధరాతలంబునను.

3


అట్టి కంటనామాత్యుకులస్వామి—


క.

ధర సిద్ధిబేతచీ(ఱ్పు)లి
హరిణమృగేంద్రుండు బడిగొలార్జునుం డాజిని
శ్రీవచ్చ[4]లక్ష్మ గోయింద[5]
గిరివరవజ్రము జగజ్జిగీషుండు పేర్మ్మిని.

4


ఉ.

శ్రీలలనుండు దాయగజసింఘము. సో(డి)యగొంక్కధారి(ణీ)
పాలకశేఖరుం డతనిభక్తికి శక్తికి మెచ్చి యందలం
బాలలితాతపత్రనిచయంబునుం గాహడ్లును[6] దయారస
క్షాలితదోషపంకుం డగుకంటని కిచ్చె నమాత్యలక్ష్మితోన్.

5


క.

చతురుపధాశుద్ధమహా
మతి గంటనితమ్మం డుచితమార్గ్గుండు గొంక
క్షితిపాలకునం దనిమిష
పతియందు గురుం(డు) పోలెం బరగుచు నుండెన్.

6
  1. పౌరుషం
  2. ఏలిక కెచ్చెం
  3. గట్టె
  4. సిరివచ్చ
  5. గోయింద- ఇది గోవిందుఁ డనునొకరాజుపే రైయుండవచ్చును. గోవింద యన్నను గోయింద యన్నను నొకమాత్ర యధిక మయినది.
  6. గాహళులుం