Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

బిరుదుమాడలుం[1] జెనదెపెడ్లు(ను)నింత్తియ కాని (త)మ్ములో
పారయలేనిపందల దురాత్ముల దుర్వ్వెవ[2]సాయులను దురా
చారులం జెప్పనేణ్టికి లసద్గుణధీరు..... ... వీరదు
ర్వ్వార(ణు)విస్వకర్మ[3]కులవల్లభు సూరనిం జెప్పు ణ్డిమ్మహిని.

4


చ.

అనుపమసాహసస్ఫురన[4] నర్మ్మమెయిం దలపోయ నా(ళిం?) బే
ర్క్కొని కడువీరులై నెగడుకున్నులు బొం(ద్ద)లతోడి యీడనం
జనునసహాయసాహసరసప్రియు మణ్డమహీతలేశుక
ట్టనుంగు నుదగ్రశౌర్య్యు సుభటాగ్రణిం బ్రోలమపుత్రుసూరణిని.

5


ఉ.

రాజవిభూషణుణ్డు సురరాజవిలాసు ణ్డనన్తకీర్త్తివి
భ్రాజితుం డెఱ్ఱమణ్డజనపాలకునచ్చినవజ్రదండగ
న్నోజుసుతుణ్డు సూరని మహోర్వ్వివసన్నిధిం చెక్కు రాజస
త్వోజితు విశ్వకర్మ్మకులభూషణు వైరినరేంద్రభీషణున్.

6


చ.

గొడుగులు నందలంబును నగు(ర్వ్వ)గుచున్న మహావిభూతియుం
బ్బడసెను[5] విశ్వకర్మ్మముని బార్వ్వతివల్లభుచేత విద్యమెయి[6]
గొడుగులు నన్దలంబును నగుర్వ్వగుచున్న మహావిభూతియుం
బ్బడసెను[7] నెఱ్ఱమణ్డజనపాలకుచేతను సూరం డర్మ్మమైయి[8].

7


క.

శ్రీపర్వ్వతంబు చుట్టునుం
జేపొప్ప(౦)గ(౦) బహిడతీవసనుం[9] గీర్త్తి
శ్రీపతి యగురిషిమన్మ
ణ్డాపున... ... ...స్వర... ......ణ్డనంగా.

8
  1. మొదట గణముతప్పినది.
  2. దుర్వ్వ్యవసాయు
  3. విశ్వకర్మ
  4. స్ఫురణ
  5. బడసెను
  6. మై
  7. బడసెను
  8. మై
  9. ఇచ్చట ఛందోభంగము కలిగినది. అన్వయము కుదురుటలేదు.