7
(ఈశాసనము గుంటూరుమండలములో చేబ్రోలుగ్రామందు తురకవీథిలోఁ బడియున్న రాతిమీఁద చెక్కఁబడియున్న మఱియొకశాసనము. ఇందు కాలము సూచింపఁబడలేదు గాని 6వ సంఖ్యశాసనము నిదియు నొక్కనివే. ఒక్కరాతిమీఁదనే చెక్కఁబడియున్నవి. South Indian Inscriptions Vol. VI. No. 117)
క. |
శ్రీరమ(ణీయు)ణ్డు గులని
స్తారకుణ్డు న...... వ్యచంద్రు(ణ్డు) సుజ(నా)
ధారుణ్డు గన్నయపుత్రుణ్డు
సూరణ్డు(సూ)... పత్తికొణ్డసూరక పేర్మ్మిని.
| 1
|
చ. |
జితరిపు(బే)తమణ్డలికసంఘము[1] జేగిరి[2] పశ్చిమ(ంబు)న
పతి యగు[3](నె)ఱ్ఱమఱ్ఱజనపాలకు లేశమహాప్రధానిక
స్థితియును నం(ద)లంబును విశేషవిభూతియుం (బే)ర్మ్మితోడ ప్ర[4]
స్తుత(మ)గుచుణ్డం గండ డనిసూర(ణ్డు) పౌరుషధర్మ్మసారుణ్డై.
| 2
|
చ. |
తన......లోకవిదితంబుగా బ్బ్రోచిన[5] పణ్డధరుణీ[6]
జనపతిమస్తవంబున[7] బ్రిశస్తితి[8] నబ్బెజవాడ నన్యసా
ధనసుభటావలిం దున్మి[9] తమ్ములు దానునుఁ బోరిలోనం బే
కాని గెలిపించె నా(డు)నధికు ణ్డగుసూరణ్డు శౌర్య్యసారుణ్డై.
| 3
|
- ↑ సింహము
- ↑ శ్రీగిరి- అని యుండనోపు.
- ↑ పశ్చిమంబునం బతియగు
- ↑ తోడంబ్ర
- ↑ తంబుగంబ్రోచిన
- ↑ ధారుణీ
- ↑ సంస్తవంబున- అనియుండనోపు.
- ↑ భృశస్థితి
- ↑ దునిమి