Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శ. స. 1046

(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడగ్రామమందు ఇంద్రకీలపర్వతము క్రిందిభాగమున ఖిలమయి యున్న మండపములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. మొదటి 11 పంక్తులు వచనము. దాని తరువాత నొకకందపద్యమును నొకవచనమును గలవు. అవి చాలవరకు శిథిల మైనవి. తరువాత నీక్రిందిపద్యము లున్నవి- South Indian Inscriptions Vol. IV. No. 737 )

ఉ.

ఆతనితమ్ము ణ్డన్వయవియత్తలమిత్రు ణ్డసేష[1]దిక్తట
ఖ్యాతయశోర్త్తి[2] భీ(మ)ణ్డు సుఖస్థితి రాజై[3] యబ్ధివేష్టిత
క్ష్మాతలనాథు లెల్ల సరిగాపులమాడ్కిన తీఱువెట్ట మాం
ధాతయయాతివేణు న్రిగధర్మ్మజుల ట్ల[4]తిప్రగల్భుండై.

1


గీ.

పరమహీశులు భక్తులై బంప్పం బనులు
సేయు చుణ్డంగ్గం దపనురస్మి[5]యును గాడ్పు
చొచ్చినచ్చొన తనయాజ్ఞ సొ(చ్చి) వెలుంగు[6]
భూమి యెల్లను బంగ్గెనభీమ ణ్డేలె.

2


స్వస్తి సమస్తభువనాస్రయ రాజాధిరాజ రాజపరమేస్వర పరమ
భట్టారక రవికులతిలక సత్యాశ్రయవం(స్య) చాలుక్యాభరణ శ్రీ
త్రిభువనచక్రవర్త్తి శ్రీమత్పెర్మ్మనడి దేవరదివ్యసహస్రవర్షంబులు
46గు శ్రాహి శ్రీ వేంగిదేశచాలుక్య........కకాఱపరమణ్డల
చూఱకారపతిదేవ(గురుద్విజభక్తులైన) కుఱుమఱజముణ్డైన మహామణ్డ
లీక భీమ .......... లకు మెచ్చి బెజవాడ రడ్డికంబు దయసేసిన.

  1. శేష
  2. యశోర్థి
  3. రాజయి
  4. లట్టులతి
  5. రశ్మి
  6. వెలుంగ - అని యున్న నన్వయము సుకరముగా నుండును.