86
(ఈపద్యములు గుంటూరుమండలములో అమరావతిగ్రామమందు అమరేశ్వరునియాలయము మండపములో నొకఱాతిపలకమీఁద చెక్కఁబడియున్న శాసనములో నున్నవి. Government Epigraphist's Collection No. 260 of 1897)
ఉ. |
యిందుృండు ధాన్యవాటి నమృతేశు ప్రతిష్ట యొనర్చ్చె పంటరె
డ్డీందృండు అన్నవేమధరణీశ్వరు చేశ పునఃప్రతిష్ట ఆ
చంద్రదినేంద్రతారకము శాశ్వత మవునని యీశ్వరాజ్ఞచే
హంద్రికె పెద్దమంత్రి సుగుణాంబుధి నిల్పెను సుప్రతిష్ఠయును.
| 1
|
చ. |
వరవసువేదబాణశశివర్న్నితమౌ శకవత్సరంబులను
అరయంగ అక్షయాబ్దమున హంద్రికె కోనయ పెద్దమంత్రి యి
ద్ధరవిచంద్రతారకము దన్నలకోట అమరేశలింగమును
స్తిరతరభక్తితోడ ప్రతిష్ట యొనర్చ్చె పుణ్యశాలియై.
| 2
|
ఈపద్యములందు దోషములు మెండుగా నుండుటచే వానిని సవరించి యిప్పటివర్ణక్రమమును బట్టి యీక్రిందఁ జూపుటయైనది.
ఉ. |
ఇంద్రుఁడు ధాన్యవాటి నమృతేశుఁ బ్రతిష్ఠ యొనర్చెఁ బంటరె
డ్డీంద్రుఁడు అన్నవేమధరణీశుఁడు చేసెఁ బునఃప్రతిష్ఠ యా
చంద్రదినేంద్రతారకము శాశ్వతమౌ నని యీశ్వరాజ్ఞచే
హంద్రిక పెద్దమంత్రి సుగుణాంబుధి నిల్పెను సుప్రతిష్ఠయున్.
|
|
చ. |
వరవసువేదబాణశశివర్ణితమౌ శకవత్సరంబుల
న్నరయఁగ నక్షయాబ్దమున హంద్రికె కోనయ పెద్దమంత్రి యి
ద్ధర రవిచంద్రతారకము దన్నలకోటమరేశలింగమున్
స్థిరతరభక్తితోడను బ్రతిష్ఠ యొనర్చెను బుణ్యశాలియై.
|
|