Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87

శ. స. 1600

(ఇది కృష్ణామండలములో నందిగామగ్రామమందు రామలింగేశ్వరస్వామి గుడి మండపములో నొకఱాతిస్తంభముమీఁది శాసనము. Government Epigraphist's Collection No. 252 of 1924.)

చ.

అరయంగ శాలివాహనశక[1]హాయనముల్ వెయినారునూరువో
మరిదగు పింగ్గళాబ్దమున మాఘమునందలి శుద్ధపంచ్చమిన్
విరివిగ వాశిరెడ్డి ఘనవీరయరామన నంద్దిగామలో
స్మరహరుకై యొనర్చ్చె ముఖమంటప మాశెశి[2]భాస్కరంబ్బుగనూ.

—————

88

శ్రీముఖ

(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడగ్రామమందు మల్లేశ్వరాలయములో విఘ్నేశ్వరునిమందిరమునెదుట నొఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. శకసంవత్సరము లేదు. South Indian Inscriptions Vol. IV. No. 775.)

శ్రీముఖసంవత్సర మాఘశు 5 ఆ దాసమహంతి కుమారుడు
శివమహాపాతృని అంన చొకాఇపాతృడు మల్లేశ్వరుని గుళ్లోని కేశవ
నాథని గుడి సుంనం శేయించెను॥


శా.

ఔరా దాసయచొక్కపాతృ(౦)డు సమోన్నత్యదానవారాశి (యై[3]
శ్రీ) రంజిల్లె(డి) మోటురీపురి(౦) బ్రతిష్ఠించె ముదంబొప్ప(౦)గాం

  1. శాలివాహశక
  2. శశి
  3. "పాత్రుం డసమానౌన్నత్యవారాశి యై" అని యుండనోపు.