Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

85

శ. స. 1534

(ఈపద్యము నెల్లూరుమండలములో ఆత్మకూరుతాలూకా కుల్లూరుగ్రామమందు శివాలయముదగ్గఱ నున్న యొకఱాతిమీద చెక్కఁబడియున్నది. పద్యమునకుఁ బూర్వభాగమునం దున్నవచనములో "శాలివాహనశకవర్షంబులు 1534 అగు నేంటి పరిధావిసంవత్సర కార్తిక బ 12 సో" నాఁడు చింతపట్ల రుద్రప్పనాయఁడు అనంతసాగర మను చెఱువు తూర్పుటలుఁగునకు “ముప్పదిమూడుశిలాస్తంభాలు నిలిపి యిరుగడల సంతనిసారువులు సౌపానాలు కలుగు” కట్టించినట్లున్నది — నెల్లూరి శాసనములు 1-245)

సీ.

అవగాహనేహాసమాయాతవిబుధరా
            ట్కమనీయ్య[1]మణిశతాంగము లనంగ
తాటాకసేతుసందర్శనేచ్ఛాగత
            స్థితసమున్నతమహాశిఖరు లనగ[2]
నీతి నుజ్వలధరానేతృసంపాదిత
            మూర్తీభసత్కీర్తిమూర్తు లనగ[3]
ముక్తామణీయుక్త మోహనాంబరచుంబ్బి
            వరుణరాజన్యగోపురము లనగ[4]
నిలిపెం గుల్లూరి నల్లచెర్వలుగునంద్దు
ముప్పదియుమూడు[5] రాకంబములుం జెలంగ
చింతపట్లపురస్థాయి శ్రీనిధాయి
రుచిరగుణహారి చెంచయరుద్రశౌరి.

1

—————

  1. కమనీయ
  2. లనంగ
  3. లనంగ
  4. లనంగ
  5. మూండు