Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రవిడభూమధురాదిధాటీచలద్రయ
            బలరక్షణాక్షీణబాహుబలుండు
పెనుగొండ్డసమరయావనపాదుషాగర్వ
            ఖర్వీకరణచణాఖర్వభుజుండు
ర[౦]గమాంబ్బాకుమారవతంసరత్నంబ్బు
            పరభీమబిరుదులభాయిబండ్డి
విమతావనీశ్వరవేశ్యాభుజంగ్గుండు
            బల్లరగండాంకభాసురుండు
మన్నెహంవ్వీరుండు మగలరాయండు [రా]చ
            బెబ్బులి పరరాజభీకరుండు
మట్లి తిర్వెంగళమానవాధిపరత్న
            రత్నాకరుం డనంత్తరాజశౌరి
తమతండ్రి యల్లభూరమణుండు ...
            తిరుపతి రాజుపైం బెరిగి కొట్టి
తనకత్తిమొనం దెచ్చుకొనిన[సి]ద్ధవటంబు
            చెల[౦గత][1]నపేర చెరువు సేసె
హృదయ ముప్పొంగ సిద్ధవటేశ్వరునకు
ఔపచారికమైన సాలాంత్తరముగ
పురముచుట్టును వరణమై పరిణమింప్ప
ధాత్రిం గట్టించ్చె నాచంద్రతారకముగ.

—————

  1. చెలంగంగం దనపేర