Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రయమునం బెకలించె రావణుం డొకకొండ
            సృక్కెం గుమారుచే నొకకొండ
వరముని ఆజ్ఞ గర్వ్వ మణంగె నొకకొండ
            వుర్వ్విం జుట్లుపెట్టె నొకకొండ
వున్నకొండలుం గపు లెత్తి రుదవిడిని
చారుధీరత నీతోడ సవతు శాయ
యెన్నివిధములం దలంచిన యింకం గలరె
అలఘుదోర్దండ వీణెతిమయకొ(౦డ).

1

వ్రాఁతతప్పులు మెండుగా నుండుటచే వానిని సవరించి యిప్పటివర్ణక్రమానుసారముగాఁ బైపద్యము క్రిందఁ జూపఁబడినది.

సీ.

తిరిగెఁ గవ్వంబయి శరధిలో నొకకొండ
            యుగ్రునివి ల్లయ్యె నొక్కకొండ
యాలఁ గాచుటకునై హరి యెత్తె నొకకొండ
            యుదధిలోపల దాఁగె నొక్కకొండ
రయమునఁ బెకలించె రావణుం డొకకొండ
            స్రుక్కెఁ గుమారుచే నొక్కకొండ
వరమునియాజ్ఞ గర్వ మణంగె నొకకొండ
            యుర్విఁ జుట్టులు పెట్టె నొక్కకొండ
యున్నకొండలఁ గపు లెత్తి రుద్దవిడిని
జారుధీరత నీతోడ సవతు సేయ
నెన్నివిధములఁ దలఁచిన నింకఁ గలవె
యలఘుదోర్దండ వీణె తిమ్మయ్యకొండ.

—————