|
మలిపించ్చి తెప్పించి నిలిపించె కంభముల్[1]
తలంప[2] గోచరమైన తరము లెత్తి
జగతి ఆచంద్ర[3]తారార్క మగుచు నెరయ
నికిలజను లలక ప్రఖ్యాతిని వహించె[4]
(భాగ్యసవుభాగ్యనిధి)[5] పరమవైష్ణవసజ్జనపారిజాత
కోరి సద్గుణమణి పెదకూరపాటి(వంశాబ్ధిచంద్ర)
దీపితోదారి మాదయగోపశవురి.[6]
| 1
|
|
ప్రమాదీచసంవత్సర పుష్యశు 10 సో॥ కూరపాటి గోపినేండు
దుగ్గెవంకేశ్వరదేవుని కంభంప్రతిష్ట సేశను.
|
|
82
(ఇది కర్నూలుమండలములోని ఎగువ అహోబలమందు అహోబలస్వామి యాలయముగోడమీఁద నున్నపద్యము. వ్రాఁతతప్పులు పెక్కులు గలవు. లిపిని బట్టి శాసనము 1500 ప్రాంతము దనవచ్చును.)
సీ. |
తిరిగెం గవ్వంబై శరధిలో నొకకొండ
వుగృనివిల్లయ్యె నొకకొండ
ఆలంగా(చు)టకై హరియెత్తె నొకకొండ
వుదధిలోపల దాంగె నొకకొండ
|
|
- ↑ కంబము
- ↑ తలంపం
- ↑ నాచంద్ర
- ↑ "నిఖిలజగములం బ్రఖ్యాతిని వహియించె" అని యుండనోపు.
- ↑ కుండలీకరణములు చేసిన భాగములు విడిచినచో నైదుగీతపాదము లగును. పెక్కుచోటుల విసంధు లున్నవి.
- ↑ శౌరి