Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

శ. స. 1514

(ఈపద్యము గుంటూరుమండలములోని అమీనుబాదాగ్రామమందు మూలాంకురమ్మగుడి తూర్పుద్వారము కుడిప్రక్కను చెక్కఁబడి యున్నశాసనములో నిమిడియున్నది. ఇది గోలకొండరాజయిన ఇభరాం (Ibrahim) పాదుషాగారి సేనానాయకుఁ డైన అమీన్ మలక (Amin-ul-mulk) గారు శ. స. 1514 కు సరియైన నందనసంవత్సర వైశాఖశు 3 గురువారమునాఁడు చెక్కించిన ప్రతాపధర్మశాసన మని యున్నది. ఇభరాంగారు కొండవీడురాజ్యమును సంపాదించిన విషయమును జెప్పునవసరమున నీపద్యము చెప్పఁబడినది.)

"మొదలను శాలివాహనశకవర్షంబు లగు 1502 అగు నేండు
విక్రమసంవ్వత్సర చైత్ర బ 14 భవుమవారంనాండు హజరత్ యిభ
రాహిం పాదశహవొడయలుంగారు తమనామజాదు అంపితేను—


దాటగ[1] నేంగి వుద్దగిరి[2] దార్కొని వెంకటరాజుం దోలి ముం
గోటలు లగ్గవట్టి వినికొండ్డయు బెల్లముకొండ్డ తంగ్గెడల్
పాటపరిన్ హరించ్చి మరి బల్మిని గైకొనె కొండ్డవీడు క
ర్నాటకరాజధాని యిభరాముండు బాహుబలంబు మీరుచునూ.


యీలాగు ప్రతాపాన కొండవీంటి రాజ్యం పుచ్చుకొని రాజ్యం
పరిపాలిస్తున్ను వుండ్డెను.

—————

84

శ. స. 1527

(ఈశాసనము కడపమండలము సిద్ధవటము ప్రాఁతకోటయొక్క తూరుపుద్వారముగోడమీఁద చెక్కఁబడియున్నది. Government Epigraphist's Collection No. 564 of 1915.)

  1. ధాటిగ
  2. యుద్ధగిరి