పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కున శాస్త్రము

15


తా. ఓ లక్ష్మీశా ! నరసింహస్వామి! పురమును ప్రవేశించి
వచ్చునపుడు యెడమవైవున బల్లి పలికినచో శుభము లధికముగా
గల్గును శుభకార్యములు వెంటనే సిద్దించును.

క. కుడి దిక్కుఁ బలుక , కార్యం
   బెడనెడ నాలస్యమగును, | నెదురుగ బలుకన్
   పడగొట్టి నటులఁ గార్యము
   చెడు, వెనుకను బల్క శుభము | శిఖినరసింహా.42

తా. ఓ నరసింహస్వామి! పురి ప్రవేశించునపుడు బల్లి కుడి
వైవునుండి పలికిన కార్య మాలస్యముగా నగును. ఎదురుగ బల్కి
నచో కార్యము చెడిపోవును. వెనుకనుండి పలికిన చో శుభముకలుగును,

క. తోరణ గౌళియుఁ బలికిన
   నారూఢిగ బంధుహిత ప్రి |యాంగన రాకల్
   కోరిన కోరిక లబ్బును,
   శ్రీరమణా నిశ్చయంబు | శిఖి నరసింహా.43

తా. ఓ నరసింహా! బలుల సమూహము పలికినచో బంధువులు,
స్నేహితులు,ప్రియురాండ్రు వచ్చెదరు. కోరిన కోరికలు నెఱవేరును.

క. ధర పయనము నడువంగా,
   వర దక్షిణగౌళి పలుక | వరలును శుభముల్
   నెరయోధుల పెండ్లిండ్లకు ,
   సిరు లలరఁగ బసిఁడివంట | శిఖినరసింహా.44

తా. ఓ నరసింహస్వామీ! ప్రయాణమై పోవునపుడు దక్షిణ
ముగా బల్లి పలికిన శుభములు గల్గును. పెండ్లిండ్లప్పుడు పలికిన
ధనలాభము గల్గును.