14
శ కు న శా స్త్ర ము
క. వచ్చిన దూత తనకు
దానచ్చుగ దాపలను నిలిచి | యటు కూర్చుండన్
మెచ్చుగ వెలుపలి కరిగిన
జెచ్చెర కార్యంబు నట్టె ! శిఖినరసింహా,38
తా.ఓ నరసింహస్వామీ! దూత వచ్చి యెడమవైపుననిలిచి తరు
వాత కూర్చుండి కుడివైపునకు బోయినయెడల కార్యసిద్ధి యగును.
--:గౌ ళి ప లు కు శ కు న ము:--
క. తలచుక ప్రార్ధన జేసిన
వలపలి దిశగౌళిపలుక | వలనగు శుభముల్,
ఇల పయినము కొఱగాదట
చెలువగు శుభకార్యమండ్రు | శిఖినరసింహా,39
తా.ఓ నరసింహస్వామీ! ప్రయాణసమయమున పార్థన జేయు
సపుడు బల్లి యెడమవైపున పలికినయెడల శుభముగలుగును. ప్రయాణము
వ్యర్ధము గాక శుభకార్యమగును.
క. దాపలఁ బల్కిన సకలము
నాపద లగు, పయనములకు | నతిశుభ మమరున్
చూపరులకు దృష్టాంతము
శ్రీపతి పాదంబు లాన | శిఖనరసింహా,40
తా. ఓ లక్ష్మీశా! నరసింహా ! నీ పదములాన బల్లి వట్టియప్పుడు
యెడమవైపు బల్కినచో ఆపదలు కలుగును. ప్రయాణ సమయమునం
దటు పలికినచో మేలు గలుగును.
క. పురిఁజొచ్చి వచ్చునప్పుడు
సరయఁగ దాపలను బల్క | నధిక ఫలంభౌ
వరశుభములు శీఘ్రంబులు
సిరి వరదా! నిజము లివ్వి | శిఖినరసింహ.41