పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

16

శ కున శాస్త్రము


క. ఎనిమిది దినముల కొక్కటి
   యెనిమిది దిక్కులకు జాము లెనిమిది ఫలముల్
   విను మొక్క దిక్కునకునగు
   చిన యో బళగిరి విహార | శిఖినరసింహా.45

తా. ఓ చినయోబళగిరియందు విహరించే నరసింహస్వామి,
ఎనిమిది దినములకు ఎనిమిది దిక్కులకు క్రమముగా యెనిమిది జాము
లకు వేర్వేర క్రమముగా ఫలములు చెప్పుచున్నాఁడను,

క. భయమును, జింతయు హానియు,
   క్షయమును లాభంబు ధనము | సంపద శుభమున్
   నయముగ నెనిమిది జాములు
   [1] జయమింద్రుని గౌళీఫలము | శిఖినరసింహా,46

తా. ఓ నరసింహా! క్రమముగా 8 జాములందు తూర్పుదిక్కు
నందు భయము, చింత, హానిక్షయము, లాభము, ధనము, సంపద,
శుభము, బల్లి పలికిన గల్గును.

క. రోదనము రణము భుక్తియు,
   జూదము వస్త్రంబు ధనము | శుభమును జయమున్
   పాదుకొను నగ్నిమూలను
   శ్రీదయితా నిత్యశుభము | శిఖినరసింహా.47

తా.ఆగ్నేయదిక్కు నందు రోదనము, యుద్ధము, భుక్తి, జూదము
వస్త్రము, ధనము, శుభము,జయము కలుగును.

క. చుట్టము లాభము గ్రోధము
   బెట్టును మరణంబుచింత | విందులు శుభమున్
   గట్టిగ దక్షిణమరయఁగ
   చిట్టౌ బలగిరి విహార ! శిఖినరసింహా.48

 

  1. యతిభంగము అయినది.