పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శకున శాస్త్రము

తా. ఓ నరసింహస్వామీ! దూత ఒంటికాలిచేత నిలుచుండి
యున్న చో ప్రయాణమును, పుల్లలు విరిచినయెడల కార్యహానియు, తల
వెండ్రుకలు తాకినచో కీడును కలుగును.

క.[1]కోలన్ నేలన్ వ్రాసిన
[2] వాలాయముతోటి నార, వడకుచునడుగన్
చాలా కష్టముఁబడుదురు
   శ్రీ లోలా సకలవిధుల ! శిఖినరసింహా, 32

తా. ఓ లక్ష్మీపతి వైన నరసింహస్వామి! దూత కఱ్ఱతో
భూమిమీఁద గీచుచుగాని నారను వడకుచుగాని ప్రశ్నము నడిగిన చో
బహుకష్టములు కలుగును.

క. ఫలకుసుమ సుగంధంబులు
   నలవడు వీ డెంబుక్షార |మాజ్యముదధియన్
   నిల బసులపంట గనినను
   చెలువుగఁ గల్యాణమండ్రు | శిఖిసరసింహా.33

తా. ఓ నరసింహస్వామి! దూత పండ్లు, పువ్వులు, సువాసన
వస్తువులు, తాంబూలము, ఉప్పు, నెయ్యి, పెరుగు, పాలు, పేడ, వీనిని
చూచిన యెడల శుభములు సిద్ధించును.

క. దగ్గుచు నుమియుచు నవ్వుచు
   జగ్గుచు సంతోషమునను | జలమంటుచు దా
   నగ్గలిక వీడెముఁ జేయుచు
   సిగ్గమరఁగ బహు శుభంబు | శిఖినరసింహా.34



(పోలాయము తొటిత్యాడు పడుకుఁచు నడుగన్) అని పాఠాంతరము ,

  1. కోలను నేలను రాచిన
  2. వాలాయము తోటి నోటి వడుకుచు నడుగన్.