పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకున శాస్త్రము

13


తా.ఓ నరసింహస్వామి! దూత దగ్గుచుగాని ఉమ్ము వేయుచు
గాని, నవ్వుచుగాని, సంతసముగల్గిగాని,నీళ్లు తాకుచుగాని, తాంబూ
లము నములుచుగాని, పశ్న వేసినచో మిక్కిలి మేలుగలుగును.

క. చూరున్ పెండెము వాసము
   లారయ [1] చెయ్యూది యడిగి | యాకులుజీరన్
   నారయు జీరుచు నడిగిన
   శ్రీరమణా శుభము దొలఁగు { శిఖినరసింహా,35

తా. ఓ లక్ష్మీరమణా! నరసింహా! దూత, చూరు పెండెము,
వాసము వీట్లపైని చేయి వేసిగాని, ఆకులు చీరుచుఁగాని, నారను,
చీల్చుచుఁగాని వశ్న వేసినచో అశుభము గలుగును.

క. భోజనముఁ జేసి వేడుక
   రాజసమున శకున మడుగ |రంజిల్లునయా
   తేజంబుగ గార్యములగు
   శ్రీజయ యివినిజము లగును | శిఖినర సింహా.36

తా. ఓ నరసింహా! దూత భోజనము చేసి సంతోషముతో
ఒయ్యారముగా శకున మడిగిన యెడల కార్యములు సిద్ధించును.

క. చింతించిన జింత యగున్
   గొంతున్ గూర్చున్న గీడు | గొణుగుచునడుగన్
   పొంతల బహుళుభకార్యము
   చెంతన్ యవశకున మండ్రు | శిఖినరసింహా.37


తా . ఓనరసింహస్వామి! దూత చింతతో అడిగిన చింతయగును.
గొంతుకగూర్చుని యడిగిన కీడుగలుగును,గొణుగుచు నడిగిన త్వరలో
శుభము కలుగును. దగ్గరకు వచ్చి యడిగిన అపశకునముకల్గును.

  1. చెయ్యూడి,