పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకునశాస్త్రము

11


క. మేలగు బుట్టము ముట్టిన
   బోలగు కార్యంబు నెడమ | భుజమటుముట్టన్
   కేలున మెటికలు విరిచిన,
   శీలము చెడి కష్టపడును | శిఖి నరసింహా. 28

తా. ఓ నరసింహస్వామి! దూత బట్టను ముట్టినచో మేలును,
ఎడమభుజము ముట్టినచో కార్యహానియును, చేతి మొటికలు విరిచి
నచో గౌరవనష్టము కష్టములును కలుగును.

క. వెన్నును వలపలి హస్తము,
   మున్నుగ ముట్టంగఁజుట్ట | ములు వత్తురయా,
   తిన్న(గ గాత్ర ము గోకినఁ
   జిన్నెలఁ జెడుఁ గార్యమెల్ల ! శిఖినరసింహా. 29

తా. ఓ నరసింహస్వామీ! దూత వీపును కుడి చేతితో తాఁకె
నేని బంధువులు వత్తురు. శరీరమును గోకినచో కార్యహాని యగును.

క. చరణములు బెనచి నిలిచిన
   తరుగదు దుఃఖంబు నిలువ |దగదిల మడమన్
[1] ధరవేరు పదముపై గాన్
స్థిరముగఁ గూర్చున్న మేలు | శిఖినరసింహా.30

తా.ఓ నరసింహస్వామీ! దూత పాదములు పెనచుకొని
నిలువబడిన చోదుఃఖమును, భూమికి మడమ ఆనించి నిలుచున్న చో
కీడును, పాదము తొడపై న వేసుకొని కూర్చున్న చో మేలునుకలుగును,

క . ఒక కాలనిలిచి యుండిన
    నకటా వయనంబు గలుగు | నటువుడకల్బ
    ట్టుక విరిచినఁ జెడు కార్యము
    చికురములం బట్టఁజెడును ఆ శిఖినరసింహా.31

  1. 1 విరవేరు, 2 విరవేరె = పాఠాంతరములు,