పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

శకునశాస్త్రము


క. నాసిక ముట్టిన వ్యాధియు
   వాసిగ దిగ్విజయమగును | వామశ్మశ్రుల్
   మోసము దావలి మీసము
   శ్రీసతి పతి మెడను శుభము | శిఖినరసింహా.25

తా. ఓ లక్ష్మీనరసింహస్వామి! దూత ముక్కు తాకినరోగమును,
ఎడమమీసము ముట్టినచో దిగ్విజయమును కుడిమీసము ముట్టినచో
మోసమును, మెడ తాఁకిన శుభమును కలుగును.

క.గడ్డంబు కార్యహానియు
  దొడ్డ ఫలంబురము నంట | దుదిఁగుడిచంటన్,
  బడ్డన నామయమగు బహు
  చెడ్డది గద యెడమ చంట ! శిఖినరసింహా. 26

తా. ఓ నరసింహస్వామి ! దూత గడ్డమును స్పృశించిన
కార్యహానియు, ఱొమ్ము స్పృశించిన మేలును, కుడిచన్ను తాఁకిన
శుభమును, ఎడమచన్ను తాకిన కీడును కలుగును.

క .కడు పంటిన సంతోషము
   నడు మంటిన రోగమగును | నయమగు శుభమున్
   కుడిచేతి కడను ముట్టినఁ
   జెడుగగు [1] శేఫంబుముట్ట ! శిఖినరసింహా,27

తా. ఓ నరసింహస్వామీ! దూత కడుపు తాకిన సంతోష
మును, నడుమునంటిన రోగమును, కుడిచేతిచివర నంటిన శుభమును,
పురుషాంగమును తాఁకిన కీడును కలుగును.
 

  1. పురుషము = పాఠాంతరము జెడు శేఫము ముటనేని పా ||