Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 వ్రతరత్నాకరము

నకు చక్కని లక్షణములుగల శీల యను పేరుగల కన్యక పుట్టెను. ఆచిన్న బిడ్డ చక్కనినడతగల తల్లియింట దినదిన ప్రవర్ధమానమై యుండెను. ఆచిన్న బిడ్డకు తల్లియగు దీక్ష జ్వర ముచేఁ గష్టపడి, నానాటికిఁ జిక్కి నదీతీరంబున మృతినొంది స్వర్గలోకంబునకుఁ బోయెను. తర్వాత సుమంతుఁడును అగ్ని హోత్రాదికార్యములు లేకపోవుననుభీతిచేత చెడుస్వభావంబు గలదెయు, క్రూరురాలును, ఎల్లప్పుడు జగడములాడునది యునైన కర్కశయను పేరుగల కన్యను బెండ్లి చేసికొనెను. ఆశీలయన్ననో తనతల్లి చనిపోవుటచేత నింటిషనులు చూచుటయందు శృద్ధ గలదై, గోడలకు, స్తంభములకు, చిన్ని గోడలకు, కడపలకు, మొత్తలకుఁ బంచవన్నె ముగ్గులను బెట్టుచుఁ గమలములను స్వస్తికములను వేయుచు దేవపూజలు చేయుచుండెను. తండ్రి యగు సుమంతుఁడును తనకూఁతునకు యాచనపుచిన్నెలు వచ్చుటను చూచి ఈకన్య నేవనికిత్తునని యాలోచన చేయుచుం డెను, అప్పుడు కౌండిన్యుఁ డను ఒకమహాముని సకలవిద్యలను జదివి గుర్వాజ్ఞను బొంది పెండ్లి చేసికొనుటకై వచ్చుచుండెను. సుమంతుఁడును తనక్యూతు నాయన కియ్యవలసినదని నిశ్చయించెను. అట్లు నిశ్చయించి, కౌండిన్యమహామునికిఁ దనకూఁతు నిచ్చి తనశాఖ ప్రకారము పెండ్లి చేసి, పెండ్లి యయినత ర్వాత, తన భార్యయగు కర్కశను బిలిచి "అల్లునికి బహుమతిగా సారె పెట్టి పంపవలయుడు, “ఏమియున్నది” యనియడుగఁగా, ఆకర్కశ యా బ్రాహ్మణుని మాట విని మిక్కిలి చిరాకుతో లోపలికి వచ్చి తలుపు టంగున బిగించి, “పోపో” యని పలికెను. అంత నా సుమంతుఁడు మిగిలినసత్తుపిండి నిచ్చి తనయల్లుని, కుమార్తెను సాగనంపెను.