$7 అనంత వ్రతము
డను; కృష్ణుఁడను; ఇంద్రుఁడను; విష్ణువను, శివుఁడను, బ్రహ్మను, సూర్యుఁడను; ఆది శేషుఁడను; సర్వవ్యాప్తియైయుండు ఈశ్వరుఁడను. సకల ప్రపంచము నారూపమే, నేను గొప్పరూపంబుగల వాఁడను. సృష్టిస్థితిలయంబులకుఁ గారణభూతుఁడను. అనంత పద్మనాభుఁడను; నరసింహవామనావతారముల నే తీనవాఁడను నేనే. ముందే నమ్మకము కలుగుటకుఁగానే నేను అర్జునునికి నావిశ్వరూపంబు చూపితిని. నేనే పర బ్రహ్మస్వరూపుండను, నన్నే యోగులు ధ్యానింతురు. ఈ ప్రపంచమెల్ల నాస్వరూపమే. నాకు అంతము లేదు. నాయందే పదునలుగురు మసువులును, అష్టవసువులును, పన్నిద్దరు సూర్యులును, పదునొకండుగురు రుద్రులును, సప్తఋషులును, సముద్రములును, పర్వతములును, నదులును, వృక్షములును. నక్షత్రములు, దిక్కులు, భూమి, పాతాళము, భూర్భువరాదిలోకములును నున్నవి. ఓయుధిష్ఠిరా! యీ విషయమున నీకు సంశయమే నలదు. అన్నియు నేనే” అని చెప్పెను.
ఆపలుకులు విని, ధర్మరాజు "ఆవ్రతము నాచరించిన నేమి పుణ్యము? ఏమిఫలము? దాని కేమి యివ్వవలయును? ఏ దేవతను బూజింపవలయును. ఎవఁ డీ వ్రతమును ముం దాచ రించెను? ఎట్లు మనుష్యలోకంబున వెల్లడియయ్యెను? ఈసంగతి యెల్ల విస్తరించి చెప్పుము" అని యడుగఁగా, శ్రీకృష్ణుఁడు ధర్మరాజునకు నిట్లనెను.
పూర్వము కృతయుగంబున సుమంతుఁడనియొక బ్రాహణుఁ డుండెను. ఆతఁడు వసిష్ఠగో త్రమునఁ బుట్టిన వాడు. అపీపుడు చక్కనిరూపంబుగల భృగువంశంబునఁ బుట్టిన దీక్ష యనుకన్యక నొకదానిని విధి ప్రశాతముగా: బెండ్లియాడెను. కొంతకాలము