పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనంత వ్రతము


కౌండిన్యమునియు ఈశీలను బెండ్లియాడి యా క్రొత్త పెండ్లికూఁతు రగుశీలను బిలిచికొని, యెద్దులబండి నెక్కి మెల్ల మెల్లఁగాఁ బోవుచు, మధ్యాహ్న వేళకు ఒక కొలనికడఁ జేరి, మాధ్యాహ్నిక క్రియలు చేయుటకై కొలనికిఁ బోయెను, శీలయు నదీతీరమున నెఱ్ఱని పట్టువస్త్రంబులను గట్టుకొన్న వాగలే చతుర్దశి నాఁడు వేఱు వేఱుగా భగవంతుని పూజనేయు చుండు స్త్రీలను జూచెను. మెల్లఁగా వారికడకు వచ్చి “యి దేమి వ్రతము? దీని పేరేమి? చెప్పుఁడు” అని స్త్రీల నడిగెను. వారును ఇదియనంత వ్రతమని చెప్పఁగా, శీల “నేరును జేసెదను. ఈ వ్రతము చేయు విధాన మెట్లు ఎచ్చట ఏదేవునిఁ బూజింపవలయును? ఓపుణ్య కాంతలారా! నా కీవృత్తాంతమంతయు నెఱిఁగింపుఁడు” అని యా స్త్రీలను మఱల నడిగెను. వారును “ఓళీలా! ఈ వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశినాఁ డాచరింపవలయును. ఆ దినంబున అనంతపద్మనాభస్వామిని నదీతీరంబునఁ బూజించి, అతని కథను వినవలెను. పూజావిధానం బె ట్లనిన, నదియందు స్నానము చేసి యిష్ట దేవతలకు నమస్కరించి, పరిశుద్ధములైన బట్టలను గట్టికొని, యొక పరిశుద్ధ ప్రదేశమున గోమయముతో సలికించి, సర్వతోభద్రమను పేరుగల మండలము చేయించి, దానినడుమ దిమెలతో గూడిన యెనిమిదిజేకులుగలపద్మమును నిర్మించి, దాని చుట్టును తెల్లబియ్యపుపిండితోను, పంచవన్నెముగ్గులతోను, ముగ్గులు పెట్టించి, యామండలమునకుఁ గుడివైపునఁగలశము నుంచి దాని నడుమ సర్వవ్యాపకుఁడయినట్టి యనంతపద్మనాభస్వామిని యివ్విధ ముగా ధ్యానింపవలయును. శ్వేతద్వీపమునం దున్నట్టి యనంతుని దర్భతోఁజేసి యేడుపడగలు పెట్టి, పచ్చనికన్ను లనుంచి, నాలుగు చేతులుంచి, నాలుగు చేతులలో కుడి వైపునందలి పై చేతి